గత రెండు దశాబ్దాల క్రితం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోలలో శ్రీకాంత్ కూడా ఒకరు ఉండేవారు. కుటుంబ కథా చిత్రాలను, ప్రేమ కథా చిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించే శ్రీకాంత్ కు అప్పట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉండేది.అంతేకాకుండా శ్రీకాంత్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో ఎన్నో అవకాశాలను అంది పుచ్చుకున్నారు. సౌందర్య, రాశి, రోజా, రమ్య కృష్ణ వంటి స్టార్ హీరోయిన్లతో నటించారు. వీరందరి కన్నా శ్రీకాంత్, సౌందర్య నటించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

స్టార్ హీరోయిన్ల సరసన నటించిన శ్రీకాంత్ వారితో ఎంతో స్నేహంగా మెలిగే వాడు. ఇప్పటికీ ఏదైనా ఫంక్షన్ లకు వీరందరూ కలిస్తే ఎంతో ఆనందంగా, మంచి స్నేహితులు లాగా కలిసిపోతారు. శ్రీకాంత్, రాశి నటించిన”ప్రేయసి రావే చిత్రం”1999 లో విడుదల అయ్యి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి ఆ చిత్ర విశేషాలను శ్రీకాంత్ గుర్తు తెచ్చుకున్నారు.

శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ సినిమాని రామానాయుడు నిర్మించగా, దర్శకుడు చంద్ర మహేష్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలు విడుదలైన అది కొద్ది రోజులలోనే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ అప్పుడు హీరోయిన్లను గుర్తుచేసుకుంటూ ప్రస్తుత ఎమ్మెల్యే రోజా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

శ్రీకాంత్, రోజా జంటగా దాదాపు మూడు సినిమాలలో నటించారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఒకరోజు వీరి మధ్య జరిగిన ఓ సరదా సంఘటనను శ్రీకాంత్ తెలిపారు. షూటింగ్లో భాగంగా ఇద్దరిపై ఒక రొమాంటిక్ సీన్ చేయాల్సి ఉంది. ఆ సమయంలో రోజా శ్రీకాంత్ ను అన్నయ్య ఈ సీన్ అలా చేద్దాం, అన్నయ్య ఇలా చేద్దాం అంటూ శ్రీకాంత్ ను అనేదంట. దీంతో చిరాకు పడ్డ శ్రీకాంత్ కొంచెంసేపు అన్నయ్య అనడం ఆపుతావా … అలా పిలుస్తుంటే నాకు రొమాంటిక్ ఫీలింగ్ రావడంలేదని, అప్పుడు జరిగిన ఈ సరదా సన్నివేశాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here