Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన వైసీపీ పార్టీ నేతగా వ్యవహరించారు. ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన పోసానికి ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని చీటికిమాటికి ప్రెస్ మీట్ లు పెట్టి ఇండస్ట్రీపై అలాగే పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంపై కూడా తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఇలా మెగా ఫ్యామిలీ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు వారి అభిమానులకు తీవ్రస్థాయిలో కోపం తెప్పించాయి. ఒకానొక సమయంలో ఆయన ఇంటిపై కూడా దాడులు చేసారు. ఇక ఎన్నికలు పూర్తి అయ్యి ఫలితాలు ముందు కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ గురించి ప్రతిపక్ష పార్టీల గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.
ఒక్కసారిగా ఎన్నికల ఫలితాలు తారుమారు కావడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొంతమంది వైసీపీకి చెందిన చోటా నేతలందరూ కూడా అడ్రస్ లేకుండా పోయారు. అలాంటి వారిలో పోసాని కృష్ణ మురళి ఒకరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కనిపించడమే కాదు ఊర్లో కూడా లేకుండా పోయారని తెలుస్తుంది.
అరెస్ట్ చేస్తారనే భయం..
ఈయన ఎక్కడ బయట కనిపించినా అభిమానులే తనని కొట్టేస్తారు లేదంటే ఆయనపై పెద్ద ఎత్తున కేసులు పెట్టి జైల్లో కూర్చో పెడతారు ఆ భయంతోనే పోసాని తన ఫోన్ నెంబర్ కూడా మార్చేసి విదేశాలలో ఉంటున్నారని తెలుస్తోంది. ఈ భయంతోనే ఈయన ఇండియాలో లేరని ఈ ఐదేళ్లపాటు ఎవరి కంటికి కనిపించరని తెలుస్తుంది. అయితే పవన్ అభిమానులు మాత్రం ఒక్కసారి పోసాని కనపడితే బాగుండు, ఎక్కడికి మాయమైపోయారోనని ఈయన కోసం ఎదురుచూస్తున్నారు.



























