హీరోయిన్ పార్వతీ మెల్టన్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చే సినిమా ‘జల్సా’. ఆమె అందులో సెకండ్ హీరోయిన్ గా నటించారు. అందులో ఆమె తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఆ సినిమా నుంచి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ కూడా అయ్యారు. ఆమె అనేక తెలుగు మరియు మలయాళ సినిమాలలో కనిపించింది .

మొదట ఆమె తెలుగులో నటించిన సినిమా ‘వెన్నెల’. రాజాతో వెన్నెల చిత్రంలో నటించింది. దీనిలో కిషోర్ ఎక్కువగా ప్రాచూర్యం పొందాడు. అప్పటి నుంచి అతడికి ‘వెన్నెల కిషోర్ ’ అనే పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రం హల్లోలో మోహన్ లాల్ తో నటించింది.

ఆమె మళ్లీ తెలుగులో మహేష్ బాబు సరసన దూకుడు అనే ఐటమ్ సాంగ్ ” పూవై పూవై ” లో సాంగ్ లో కనిపిస్తుంది. ఆమె 2013 లో శంసు లాలానిని వివాహం చేసుకుంది, తరువాత సినిమాల నుండి రిటైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఆమెను ఇద్దరు తెలుగు దర్శకులు మోసం చేయడంతో తన కెరీర్ నాశనం అయిందని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

వాళ్ల పేర్లను మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆమె తన భర్తతో అమెరికాలో తన వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక 2012 సంవత్సరంలో తెలుగులో ‘యమమో యమ’ చిత్రంలో చివరి సినిమాలో నటించారు. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇలా ఆమె దర్శకుల పేర్లు చెప్పకపోవడంతో వివిధ రకాలుగా ఊహించుకుంటున్నారు నెటిజన్లు.


































