కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని గడగడలాడించిన వైరస్. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచం నలుమూలలా వ్యాపించి లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ వైరస్ పుట్టి రెండేళ్లు దాటుతున్న కూడా ఇంకా కరోనా కేసులు తగ్గడం లేదు. కొన్ని దేశాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న, మరికొన్ని దేశాలలో అంతకంతకు విజృంభిస్తోంది.

యూరోప్ దేశాల్లో ఈ వైరస్ రోజుకో సరికొత్త రూపం సంతరించుకుంటూ విజృంభిస్తుంది.ఈ క్రమంలోనే యూరోప్ లో గత వారంలో 11 శాతం కేసులు పెరిగినట్లు ప్రకటించగా వచ్చే వసంత కాలం నాటికి కరోనా ఐరోపాలో 7,00,000 వరకూ కోవిడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని who సంస్థ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్‌లుగే హెచ్చరించారు.
ఈ విషయం పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని యూరోప్ లోని దేశాలన్నిటిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వం తప్పనిసరిగా కరోనా నియంత్రణ కోసం నిబంధనలు పాటించాలని మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.ఇప్పటికే యూరోపియన్ దేశాల్లో అనేక ప్రాంతంలో 1బిలియన్ కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.యూరప్, మధ్య ఆసియా ప్రాంతాలలో కోవిడ్ కల్లోలం చాలా తీవ్రంగా ఉంది.
అంతేకాదు శీతాకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ప్రభుత్వాలు, ఆరోగ్య అధికారులు, వ్యక్తులు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి చర్య తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ క్లూగే అన్నారు. గత వారంలో ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు కొవిడ్ నియంత్రణకు పాక్షిక లాక్‌డౌన్ సహా పలు కఠిన చర్యలు తీసుకున్నారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. వీటితో పాటుగా పలు దేశాలలో కరోనా మహమ్మారి కేసులు మరింత రెట్టింపు అయినట్లు తెలిపారు.

































