ఈవారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

0
223

బిగ్ బాస్ మరొక రెండు వారాలలో చివరి దశకు చేరుకోనుంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సన్నీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా నడుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. బిగ్ బాస్ టైటిల్ అబ్బాయిలదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హౌస్ లో మొదటి నుంచి సన్నీ అగ్రిసీవ్ గా ఆడుతుండటంతో సన్నీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ఇక చూస్తుండగానే బిగ్ బాస్ షో 12 వారాలు విజయవంతంగా పూర్తిచేసుకుని 13వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ట్రోపి కోసం షన్ను, సన్నీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇక అదే సమయంలో శ్రీరామ్, మానస్ లను కూడా పక్కన పెట్టడానికి లేదు. మానస్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇక మరొక మూడు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది.

ఇక 13 వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. అయితే ఈసారి డేంజర్ జోన్ లో కాజల్, ప్రియాంక, సిరి లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా జరిగిన ఎలిమినేషన్ చివరి అంచుల వరకు వెళ్లి వచ్చిన కాజల్ ఎలిమినేట్ అయ్యే ఆస్కారం లేదని, కాబట్టి మిగిలిన ఇద్దరూ సిరి, ప్రియాంక లలో ఎవరో ఒకరు అవుట్ అవుతారు అని అంటున్నారు.

ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి ఎలిమినేషన్ కి రెండు రోజుల ముందు నుంచే ప్రచారం జరుగుతున్నట్లుగానే ఊహాగానాలు నిజమే అవుతున్నాయి. ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కనుక నిజం అయితే ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.