Bhanupriya: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి భానుప్రియ ఒకరు. ఈమె సీనియర్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు చిరంజీవి బాలకృష్ణ సుమన్ మోహన్ బాబు వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు.

ఇలా నటిగా కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న భానుప్రియ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే తన వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. ఇకపోతే ఈమె అప్పట్లో సుమన్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి హీరోలతో నటించారు. ఈమెతో పాటు రాధిక కుష్బూ రమ్యకృష్ణ వంటి వారందరూ కూడా ఎంతో మంచి స్నేహితులు.
ఇకపోతే వీరందరూ కూడా ప్రతి ఏడాది గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఈ కార్యక్రమానికి భానుప్రియ మాత్రం దూరంగా ఉంటుంది. అయితే ఈమె దూరంగా ఉండడానికి గల కారణాన్ని ఇటీవల నటుడు భానుచందర్ ఒక సందర్భంలో వెల్లడించారు. గతంలో భానుప్రియ ఇంట్లో పనిచేసే వ్యక్తితో పెద్ద ఎత్తున వివాదానికి దిగిన సంగతి తెలిసిందే ఆ వివాదం వల్లనే ఈమె బయటకు రారు అంటూ భానుచందర్ వెల్లడించారు.
వాళ్లు పిలవరు…
ఇక ఇదే విషయం గురించి భానుప్రియ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు వెల్లడించారు. ఇలా సీనియర్ సెలబ్రిటీలందరూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటే మీరు కనిపించరనే ప్రశ్న ఎదురు కావడంతో వాళ్లు నన్ను ఆ పార్టీలకు పిలవరు అందుకే నేను కూడా వెళ్ళను అంటూ ఈమె సమాధానం చెప్పారు.



























