Naga Babu -Chiranjeevi: మెగా బ్రదర్ నాగబాబు ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగినప్పటికీ ఈయన నటుడిగానూ నిర్మాతగానూ ఇండస్ట్రీలో గుర్తింపు పొందలేకపోయాడు.తన తల్లి అంజనా దేవి పేరుపై అంజన ప్రొడక్షన్స్ స్థాపించిన నాగబాబు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈయన సక్సెస్ సాధించలేకపోయారు.

ఈ విధంగా ఎంతోమందికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మెగాహీరోలు ఇంటిలో ఉన్నప్పటికీ నాగబాబు వారితో ఒక్క హిట్ అందుకోకపోవడం నిజంగా దురదృష్టకరం.ఈ విధంగా నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీసు వద్ద చతికిల బడటంతో ఈయన పూర్తిగా నిర్మాణ రంగానికి దూరం అయ్యారు.

ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మరోవైపు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా నాగబాబు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి రీ ఎంట్రీ గురించి స్పందించారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ఆయనకు సినిమారంగంలోనే ప్రశాంతంగా ఉందని తనని రాజకీయాల్లోకి రమ్మని కోరవద్దని చెప్పినట్లు నాగ బాబు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇండస్ట్రీలోనే ప్రశాంతత ఉంది…
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 18 సీట్లను గెలుపొందారు. ఈ క్రమంలోనే ఈయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. అనంతరం ఈయన రాజకీయాలకు దూరమవుతూ తిరిగి ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తనకు సినిమా ఇండస్ట్రీలోనే ప్రశాంతంగా ఉందని చిరంజీవి వెల్లడించినట్లు నాగబాబు తెలియజేశారు.































