Samantha-Nagachaitanya: సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ ఇప్పటికీ వార్తల్లో ట్రెండింగ్ గానే ఉంటున్నారు. ‘ఏమాయచేశావే’ సినిమాతో దగ్గరైన ఈజంట.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన సంసార జీవితానికి విడాకులు బ్రేక్ నిచ్చాయి.

ఇద్దరి మధ్య విభేదాలు విడాకులకు దారి తీసినట్లు అంతా అనుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 2న వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వీరిద్దరు విడిపోవడాన్ని మాత్రం వీరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్న వీరిద్దరు మళ్లీ కలవాలనుకునే ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. విడాకులు తరువాత కొన్నిరోజుల పాటు వీరు ఒడిదొడుకులు ఎదుర్కున్నప్పటీకీ.. ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. విడాకుల అనంతరం సమంత వరస సినిమాలో బిజీ అయింది.
2019లో ఓ సారి సమంత సోషల్ మీడియాలో..
ముఖ్యంగా విడాకుల అనంతరం చేసిన పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా..ఊఊ అంటావా’ సాంగ్ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచిందిా. రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. దీని తరువాత ప్యాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ చేస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో ‘ యశోద’ సినిమా చేస్తోంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అను చేస్తోంది. అయితే తాజాగా ఈనేపథ్యంలో గతంలో సమంత చేసిన తన ప్రెగ్నెన్సీపై చేసిన ఆసక్తికర కామెంట్స్ ను నెటిజెన్లు మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2019లో ఓ సారి సమంత సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో లైవ్ చాట్ నిర్వహించింది. ఆ సమయంలో ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ… ‘నా శరీరంలో వచ్చే మార్పుల కోసం మీరంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అర్థమైంది. అలాంటి వారిక ఓ గుడ్ న్యూస్ చెబుతున్నా..2022 ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 7గంటలకు ఓ బిడ్డకు జన్మనివ్వబోతోన్న’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టును చూసి ఎమోషన్ కు గురవుతున్నారు చై సామ్ ఫ్యాన్స్. అంతా బాగుంటే వారికి బిడ్డ కూడా పుట్టేదని కామెంట్స్ చేస్తున్నారు.




























