Connect with us

Featured

ఏనాడూ గడపదాటని.. రాజకీయాలలో జోక్యం చేసుకొని మా పెద్దమ్మని అవమానిస్తారా: నారా రోహిత్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారి పోయాయి.శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు

Published

on

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారి పోయాయి.శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి వైఎస్ఆర్ నాయకులు ఎంతో అవమానకరంగా మాట్లాడారు అంటూ చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ఘటనపై పలువురు టీడీపీ నేతలు రాష్ట్ర రాజకీయ నాయకులు స్పందిస్తూ వైసిపి నాయకులు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబు నాయుడు సోదరుడు కుమారుడు హీరో నారా రోహిత్ ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలోనే నారా రోహిత్ వారి సొంత గ్రామం నారావారి పల్లికి వెళ్లి వారి తాతయ్య నానమ్మల సమాధులకు నివాళులు అర్పించి అక్కడే బైఠాయించి ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి మంచి మనసు ఉన్న వారిని అసెంబ్లీ సాక్షిగా వైసిపి నాయకులు అవమాన పరిచారని అందుకు నిరసనగా తమ పెద్దల సమాధి వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కుటుంబంలో ఉన్నటువంటి మా పెద్దమ్మ ఎప్పుడూ కూడా రాష్ట్ర రాజకీయాలలో జోక్యం చేసుకోలేదని ఎప్పుడూ కూడా ఆమె గడప దాటి బయటకు రాలేదని అలాంటి ఆమెపై ఇలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నాయకులకు నోరు ఎలా వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎంతో అవమానకర వ్యాఖ్యలను ఎదుర్కొన్నప్పటికీ తుఫాను బాధితులను ఆదుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టిడిపి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు.ఈ విధంగా నారా భువనేశ్వరికి జరిగిన అవమానానికి పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి పరామర్శించారు.

Advertisement

Featured

Teja Sajja: హనుమాన్ సక్సెస్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిన హీరో తేజ.. ఎంతంటే?

Published

on

Teja Sajja:  టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి వారిలో నటుడు తేజ సజ్జ ఒకరు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించారు. ఇకపోతే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తేజ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. జనవరి 12వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడంతో హీరోకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

తేజ సజ్జ ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నిర్మాతలు తనని కలిసి అడ్వాన్సులు కూడా ఇచ్చారని సమాచారం. ఇక ఒక సినిమా హిట్ అయింది అంటే తప్పకుండా సెలబ్రిటీలు రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు అలాంటిది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తేజ కూడా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచారని తెలుస్తుంది.

Advertisement

నాలుగు కోట్లు పెంచిన తేజ..
హనుమన్ సినిమా కోసం కేవలం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి ఈయన ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఒక హిట్ సినిమాతో ఈయన ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారు ఇలా రెమ్యునరేషన్ పెంచినప్పటికి నిర్మాతలు వెనకడుగు వేయకుండా ఆయన అడిగినది మొత్తం చెల్లిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Upasana: ఆ టాలీవుడ్ హీరో అంటే ఉపాసనకు అంత కోపమా.. ఆ హీరో ఎవరంటే?

Published

on

Upasana: ఉపాసన పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు రామ్ చరణ్ సతీమణిగా మెగా ఇంటికోడలుగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈమె తన వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో సంతోషంగా బిజీగా గడుపుతున్నారు. ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇక ఉపాసన సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబానికి కోడలుగా అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే ఈమె గతంలో తన ఫేవరెట్ హీరోల గురించి మన సందర్భాలలో తెలిపారు. అయితే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నచ్చని హీరో కూడా ఉన్నారట ఆయనని చూస్తే చాలా కోపం వస్తుందని కనీసం తనతో మాట్లాడటానికి కూడా ఉపాసన ఇష్టపడరంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

ఉపాసనకు ఇండస్ట్రీలో మరి ఏ హీరో అంటే నచ్చదు ఎందుకు ఆ హీరో పై ఆమెకు కోపం అనే విషయానికి వస్తే ఈమెకు అఖిల్ అక్కినేని అంటే ఏమాత్రం ఇష్టం లేదని తనని చూస్తేనే చాలా కోపం వస్తుందని తెలుస్తుంది. ఇలా అఖిల్ అంటే ఇష్టం లేకపోవడానికి కారణం లేదనే చెప్పాలి.

Advertisement

శ్రియ భూపాల్ తో బ్రేకప్..
అఖిల్ గతంలో శ్రియా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించారు. వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగింది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇలా అఖిల్ ప్రేమించిన శ్రియ భూపాల్ ఎవరో కాదు సాక్షాత్తు ఉపాసన కజిన్ సిస్టర్ . ఇలా తన సిస్టర్ జీవితంతో ఆడుకున్నటువంటి అఖిల్ అంటే ఉపాసనకు పట్టరాని కోపం వస్తుందని తనతో మాట్లాడటానికి కూడా ఇష్ట పడరని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Poonam Kaur: టీడీపీ జనసేన సీట్లు ప్రకటన.. కుక్క ఫోటోని షేర్ చేస్తూ షాక్ ఇచ్చిన పూనమ్?

Published

on

Poonam Kaur: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడం కోసం ఇతర పార్టీలన్నీ కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కలిసి ఎన్నికల బరిలో దిగబోతున్నారు.

ఈ క్రమంలోనే తొలి జాబితా కింద టిడిపి జనసేన కూటమి అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. ఇందులో మొత్తం 99 అభ్యర్థులను ప్రకటించగా 94 టిడిపి అభ్యర్థులు కాగా మిగిలిన 5 సీట్లను జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ లిస్టు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెతుతున్నాయి.

నాలుగు సీట్లు పొందడం కోసం ఒక పార్టీ పెట్టి తిరిగి ఆ పార్టీని టిడిపితో కలపడం దేనికి అంటూ పలువురు విషయంపై విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో నటి పూనమ్ కౌర్ కూడా పరోక్షంగా ఈ విషయంపై తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఇవ్వటం వల్లే టీడీపీతో కుమ్మక్కయ్యారు అంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

జనసేనకు ఐదు…
ఈ క్రమంలోనే పూనమ్ సోషల్ మీడియా వేదికగా దివంగత నటి శ్రీదేవి కుక్కతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇది చూసినటువంటి వైసీపీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేసేస్తున్నారు ఏం టైమింగ్ అక్క మీది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు టైం చూసి కుక్క ఫోటో వదిలింది అంటూ ఈ ఫోటోలపై కామెంట్ లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!