Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరావు ఫ్యామిలీ నుంచి మూడు తరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. నాగేశ్వరావు తర్వాత నాగార్జున… తర్వాత అతని కొడుకులు నాగచైతన్య, అక్కినేని అఖిల్ కొనసాగుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై.. తర్వాత సినిమాలకు ఆశలు రేపారు అక్కినేని బ్రదర్స్.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్ అందుకున్న అఖిల్.. మరో ప్రాజెక్ట్ తో బిజీ ఉన్నాడు. లవ్ స్టోరీ సినిమాతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగాడు అక్కినేని నాగ చైతన్య. ఇక తండ్రీ కొడుకులు కలసి నటించిన మరో సినిమా బంగార్రాజు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. జనవరి 14న విడుదల ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదల అయింది. అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చేటట్లుగా కమర్షియల్ హంగులతో ఉన్నట్లుంది ఈ మూవీ. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇంగ్లీష్ లోకి అనువదించినప్పుడు బూతు పదాలు..
ఇక ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రతీ సాంగ్ బంపర్ హిట్ కొట్టాయి. ఇక ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో కనిపించనుండగా.. కృతి శెట్టి నాగచైతన్య పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలో నాగార్జున ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. కొన్ని సినిమాల్లో మహిళలను వెంటపడి వేధించడాన్ని రొమాన్స్ గా చూపిస్తుంటారు కదా.. దానిపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. అందంతా ట్రాన్స్ లేషన్ మిస్టేక్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తెలుగులో ఓ అమ్మాయిని అందంగా వర్ణిస్తూ రాసిన పాట లిరిక్స్ ను.. ఇంగ్లీష్ లోకి అనువదించినప్పుడు బూతు పదాలు వస్తాయన్నారు. దానికి ఉదాహరణగా చెబుతూ.. బాంగార్రాజు సినిమాలోని ఓ సాంగ్ లిరిక్స్ ను అనువాదిస్తే.. ఈ రోజు నాతో పడుకుంటావా అనే మీనింగ్ వస్తుందని.. అనువాదంలో ఇలా దారుణమైన అర్థాలు వస్తాయని నాగార్జున సమాధానం చెప్పారు.
































