ప్రస్తుతం డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా డబ్బులను ఎంతో సునాయాసంగా సంపాదిస్తున్నారు. యూట్యూబ్ చానల్స్ ద్వారా, వివిధ ఇంటర్నెట్ మార్గాల ద్వారా డబ్బులను సంపాదిస్తున్నారు.భారతదేశంలో Onlyfans యొక్క ధోరణి ఇంకా లేదుకానీ.. విదేశాలలో మాత్రం చాలా మంది మహిళలు దీని ద్వారా లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా గర్భం దాల్చిన మహిళ only fans ద్వారా లక్షలు సంపాదిస్తోంది.

Onlyfans అనేది ముఖ్యంగా బాలికలు, మహిళలు వారి హాట్ ఫోటోలను పోస్ట్ చేసి.. వాటి ద్వారా డబ్బు సంపాదించే సైట్.ఈ సైట్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మహిళ ప్రస్తుతం గర్భవతి కావడంతో ఆమె ఆదాయం మరింత పెరిగిందని తెలుస్తోంది. ఈ సైట్ ద్వారా గర్భవతిగా ఉన్న ఆమె ఫోటోలను చూడటానికి ఎంతో మంది లక్షలు ఖర్చు చేయడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
యూకేలో నివసిస్తున్న కార్లా బెల్లూచి చాలా కాలం నుంచి ఈ సైట్ లో ఉన్నప్పటికీ ఆమె ప్రస్తుతం గర్భవతి ఫోటోలను షేర్ చేయడంతో ఆమె సంపాదన పెరిగింది. ప్రజలు వీటిని చూడటానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడమే కాకుండా ఆమెకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఆమె గర్భవతిగా మారినప్పటి నుంచి సుమారు 42 లక్షల రూపాయలను సంపాదించినట్లు తెలిపారు.
మరికొందరు నెటిజన్లు ఈమె బేబీ బంప్ వ్యక్తిగత వీడియోలను తనకు పంపించాలని ఆమెను కోరారు. మరి కొందరు ఆమె డెలివరీని ప్రత్యక్షంగా చూపిస్తే 9 లక్షల రూపాయల డబ్బులు ఇస్తానని ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఆఫర్ గురించి కార్లా ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆన్లైన్ సంపాదన ద్వార ఈమె సామాజిక సేవ చేయాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.































