Woman cremated Husband’s dead body : కర్నూల్ జిల్లా పత్తికొండలో సంచలనం వెలుగు చూసింది. సోమవారం నాడు ఒక మహిళ తన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించడం కలకలం రేపింది. ఒక్కసారిగా ఇంట్లో నుండి పొగలు రావడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని ఆరా తీస్తే భర్త మరణించడంతో లలిత అనే మహిళ ఇంట్లోనే అట్ట ముక్కలను పేర్చి దహన సంస్కారాలను నిర్వహించింది. కారణాలు తెలియని మరణంగా కేసు నమోదు చెసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బిడ్డల నిరాదరనే కారణం…
పత్తికొండ కు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి అదే పట్టణంలో మెడికల్ షాప్ పెట్టుకోగా ఆయన భార్య లలిత అలాగే ఆయనకు ఇద్దరు కుమారులు. ఒక కొడుకు కెనడా లో ఉండగా మరో కొడుకు కర్నూల్ ప్రైవేట్ ఆసుపత్రి లో పనిచేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం నాడు హరిప్రసాద్ గారు మరణించగా భార్య లలిత బంధువులకు కుర్నాల్ లో ఉన్న కొడుకుకు సమాచారం ఇవ్వకుండా దహన సంస్కారాలను ఇంట్లోనే నిర్వహించింది.

కొడుకుకి ఫోన్ చేసి ఇంట్లోనే దహనం చెసినట్లు చెప్పడంతో పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే శవం సగం కాలిపోయింది. ఇక ఇరుగు పొరుగు సమాచారం ప్రకారం ఆమె చాలా మంచిదని, వారిద్దరే ఒంటరిగా ఉంటున్నట్లు తెలిపారు. కొడుకులు వారిని పట్టించుకోకపోవడం వల్లే ఆమె ఇలా చేసారని ఆమె మానసిక పరిస్థితి కూడా బాగోలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. కొడుకును విచారించగా ఆస్తి తాగదాలు ఇతర గొడవలు ఏమీ లేవని, అయితే తమ తల్లి మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపినట్లు పోలీసులు చెప్పారు.