విజయనగరం: త్వరలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గజపతిరాజుపై విజయనగరంలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1999లో తాను రైతు బజార్‌కు ఇచ్చిన స్థలాన్ని తిరిగి తనకు అప్పగించాలని ఆయన ఆదేశాలు జారీ చేయడంతో సుమారు 50 కుటుంబాల జీవనం అగమ్యగోచరంగా మారింది.

ఏమిటీ వివాదం?
1999లో అశోక్ గజపతిరాజు అనుమతితో, ఎమార్వో ఆఫీస్ సమీపంలో ఒక ఎకరం 48 సెంట్ల విస్తీర్ణంలో రైతు బజార్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ స్థలంలో సుమారు 50 కుటుంబాలు రైతు బజార్‌ను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం భూముల రేట్లు భారీగా పెరగడంతో, తాను ఇచ్చిన స్థలాన్ని సాయంత్రానికల్లా ఖాళీ చేయాలని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కలెక్టర్‌కు ఆదేశాలు..
ఈ స్థలాన్ని ఖాళీ చేయించి తనకు అప్పగించాలని కోరుతూ అశోక్ గజపతిరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అశోక్ గజపతిరాజు నిర్ణయంతో తమ జీవనాధారం కోల్పోతామని ఆందోళన చెందుతున్న రైతు బజార్‌లోని మహిళలు, వ్యాపారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం విజయనగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అశోక్ గజపతిరాజుపై మహిళల ఆగ్రహం – రైతు బజార్ భూమిపై వివాదం
— TeluguDesk (@telugudesk) July 16, 2025
విజయనగరంలో 1999లో రైతు బజార్ కోసం ఇచ్చిన స్థలాన్ని తిరిగి కావాలని అశోక్ గజపతిరాజు ఆదేశించడంతో మహిళల ఆగ్రహం చెలరేగింది. భూముల రేట్లు పెరగడంతో, సాయంత్రానికల్లా స్థలం ఖాళీ చేయాలంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చినట్లు రైతులు… pic.twitter.com/FiJ9DeVA5S



























