కరోనా లాక్‌డౌన్ సమయంలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌ ఆఫర్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని ఇలానే కొనసాగిస్తే ఇబ్బందులే తలెత్తే అవకాశం ఉందని పలువురు ప్రముఖులు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్.. అంటే వామ్మో అంటున్నారు టెక్ యువకులు. ఆఫీసులో చేసే పని కంటే రెండింతలు ఎక్కువ ఇస్తుండడంతో వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. వర్కింగ్ అవర్స్ పెరగడంతో స్ట్రెస్ ఎక్కువవుతోందని వాపోతున్నా రు. హాలీ డేస్ అన్నవే మర్చి పోయామని, వర్క్ మధ్యలో బ్రేక్ కూడా దొరకడం లేదని చెప్తున్నా రు.

ఇంట్లో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉండటం లేదని, ఏదో ఒక ప్రాబ్లమ్ ఎదురవుతోందని తెలియజేస్తున్నా రు. ఆఫీసులో అయితే పని చేసే వాతావరణం, కొలిగ్స్ ఉంటారు. రిలాక్స్ అయ్యేందుకు టైమ్ దొరుకుతుంది. ఇంట్లో ఆ పరిస్థితి ఉండదు. మార్నింగ్ లాగిన్ అయితే రాత్రి దాకా మీటింగ్స్, క్లైంట్స్ కాల్స్ తోనే సరిపోతోంది. ఆఫీస్ టైమిం గ్స్ కి మించి 2,3 గంటలు ఎక్కువగా పని చేయాల్సి వస్తోంది. ఇంట్లో వాళ్లకి కూడా టైం ఇవ్వలేకపోతున్నారు. ఆఫీసులో వర్క్ మధ్యలో బ్రేక్స్ ఉండడం వల్ల కాస్త రిలాక్స్ అయ్యేవారు. ఇప్పుడు ఇంట్లో గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చుని పని చేస్తుండడంతో విసుగెత్తున్నారు. బ్యాక్ పెయిన్, కంటి సమస్యలతోనూ బాధ పడుతున్నారు. డైలీ 7–8గంటలు వర్క్ చేస్తున్నా కొన్ని కంపెనీలు వీక్ ఆఫ్, లీవ్ లు కూడా ఇవ్వడం లేదు. శని, ఆదివారాల్లోనూ ఆఫీస్ వర్క్ తోనే గడిపేస్తున్నారు చాలామంది. నెట్ వర్క్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆఫీస్ తో పోలిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 50% నుంచి 80% ప్రెజర్ పెరిగిందంటున్నారు ఉద్యోగులు.

ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన కొన్ని సాఫ్ట్వేర్, అనుబంధ కంపెనీలు ఈ ఏడాది చివరి వరకు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావంతో మూతపడిన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే తమ కార్యకలాపాలను మొదలుపెడుతుండటంతో నేటి వరకు ఇంట్లోనే ఉండి విసుగు చెందిన సాఫ్ట్ వేర్ జాబ్ చేసే యువ టెకీలకు విహార యాత్రలను ప్లాన్ చేస్తున్నాయి ఐటీ కంపెనీలు. చుట్టూ మంచు కొండలు.. మంచుతో కప్పబడిన ఆ పర్వతాల మధ్య ఉదయించే సూర్యుడిని చూస్తూ… పక్షుల కిలకిల స్వరాలను వింటూ.. చల్లని ఆ వాతావరణంలో వేడి వేడి అల్లం టీని సిప్ చేస్తూ.. ఒళ్ళో ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని పనిచేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా.! ప్రకృతి అందాలను వీక్షించడం, అడవిలో నడవడం, కొండలపై జాలువారుతున్న నీటిలో స్నానం చేయడం, నక్షత్రాల క్రింద విందు చేయడం వంటి అద్భుత దృశ్యాలను ఊహించుకుంటేనే మహాద్భుతంగా ఉంది కదా. ఊహకందని ఈ దృశ్యాలను మీ రియల్ లైఫ్ లో నిజం చేయడానికి ముందుకొస్తున్నాయి కొన్ని ఐటీ కంపెనీలు.

సాఫ్ట్ వేర్ జాబ్ చేసే యువ టెకీలకు మరికొద్ది రోజుల్లోనే ఈ అద్భుత అవకాశాన్ని అందించబోతున్నాయి. గత 6 నెలలుగా లాక్డౌన్, అన్లాక్డౌన్, సోషల్ డిస్టన్స్ వంటి వాటితో విసిగిపోయిన హైదరాబాద్‌లోని కొందరు టెక్ యువకులు తమ ల్యాప్‌టాప్‌ మరియు లగేజ్ లను సర్దుకుని వర్క్ అండ్ వెకేషన్‌కు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ట్రావెల్ కంపెనీ ఆఫ్బీట్రాక్స్ ఫౌండర్ వందన విజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ “లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండి విసుగు చెందిన కొంత మంది టెక్ నిపుణులను కాటేజీలు, హోటల్స్, హోమ్ స్టేస్, రూరల్ కమ్యూనిటీస్ ఆహ్వానిస్తున్నాయి. తక్కువ మంది వ్యక్తులతో, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కాలుష్యం లేని పరిశుభ్రమైన గాలి పీల్చుతూ తమ కార్యకలాపాలను కొనసాగించేలా అన్ని రకాల వసతులను కల్పించేందుకు కొన్ని పర్యాటక సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది యువకులు తమ వెకేషన్‌ను బుక్ చేసుకున్నారని” అని తెలియజేశారు.

అన్లాక్ 4 లో భాగంగా పర్యాటక ప్రదేశాలు తెరుచుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్, లడఖ్, కేంద్రపాలిత ప్రాంతంలోకి ప్రవేశించే టూరిస్టులు తమతో పాటు కరోనా నెగెటివ్ రిపోర్ట్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. ఒక కాటేజీలో నెల రోజుల పాటు ఉండడానికి రూ.20,000 పైనే ఖర్చవుతుంది. కాటేజీలో బెడ్రూమ్, కిచెన్, బాల్కనీ, ఎలక్ట్రిసిటీ, వైఫై వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాయి టూరిస్ట్ సంస్థలు. హైదరాబాద్‌లో ఖరీదైన మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ఏరియాల్లో అయ్యే ఖర్చు కన్నా ఇక్కడ అయ్యే ఖర్చు చాలా తక్కువనే విహార యాత్రలకు సిద్ధమవుతున్నారు టెక్ యువకులు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కదూ.. మరింకెందుకాలస్యం.. మీరూ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తునట్లైతే వెంటనే మీరు మీ బ్యాగ్ ను సర్ధుకొని విహారయాత్రకు బయలుదేరండి. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. ఆనందంగా పని చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here