ఒకప్పుడు విమానంలో ప్రయాణించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కానీ ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణం కూడా ఒక సాధారణ ప్రయాణంలా మారిపోయింది. చిన్న చిన్న నగరాలకి కూడా విమానాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత కాలంలో విమానాశ్రయాలు కొండలు, గుట్టలు, బీచ్ లు, మంచు పర్వతాల మధ్య కూడా నిర్మిస్తున్నారు. విమానాశ్రయాలు చూడటానికి కాకుండా ప్రయాణం చేయడానికి కూడా ఎంతో ప్రమాదకరం.ఈ విమానాశ్రయాలలో విమానం ల్యాండింగ్ చేయాలంటే పైలెట్లకు ఎంతో కష్టమైన పని అని చెప్పవచ్చు. మరి ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం…

*కాంగోనాస్ ఎయిర్‌పోర్ట్: బ్రెజిల్ ముఖ్య నగరమైన సావ్ పాలోలో ఉన్న ఎయిర్‌పోర్టునే కాంగొనాస్ ఎయిర్‌పోర్టు అని పిలుస్తారు. ఎయిర్ పోర్టులో రన్‌వే జారిపోతూ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతాయి.
*ప్రిన్సెన్ జులియానా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్:
ఈ ఎయిర్ పోర్ట్ రన్ వే బీచ్ పక్కన కట్టడంతో ఇక్కడ విమానం ల్యాండింగ్ చేయాలంటే పైలట్లకు కత్తి మీద సాము వంటిదే. కొన్నిసార్లు బీచ్‌లోని వచ్చిన మనుషులపై నుంచి విమానాలు పోతుంటాయి.
- కాయ్ తక్ ఎయిర్ పోర్ట్ : హాంకాంగ్‌లోని కాయ్ తక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తింపుపొందింది.
- ఆగతి ఏరోడ్రోమ్ : ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలలో ఇండియాలో లక్షద్వీప్‌కు పరిధి అగతి ద్వీపంలో నిర్మించిన ఎయిర్‌పోర్టే ఇది. ఈ ఎయిర్‌పోర్టులో రన్‌వే పొడవు 4 వేల అడుగులు మాత్రమే. అంతే కాకుండా ఇది నీటి మధ్యలో ఉంటుంది.
- బీరా ఎయిర్‌పోర్ట్: బిరా ఎల్లోగేరి ఎయిర్‌పోర్ట్ లేదా ది బిరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని పిలిచే ఈ ఎయిర్పోర్ట్ చాలా తక్కువ నిడివి ఉండే రన్‌వే ఉండటంతో దీనికి ఆనుకొని ఉన్న బీచ్‌ను కూడా రన్‌వేలా ఉపయోగిస్తారు.
- టాంకైంటీన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్:
అకస్మాత్తుగా మారిపోయే వాతావరణ పరిస్థితులు ఈ విమానాశ్రయానికి ‘మోస్ట్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌పోర్ట్’ అనే పేరు తెచ్చింది. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో భారీ విమానాలను సైతం దారి మళ్ళించడం వల్ల ఇది ఎంతో ప్రమాదకరమైన విమానాశ్రయంగా పేరుగాంచింది. - లాక్లా ఎయిర్‌పోర్ట్ : నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లా ఖుంబులో ఈ లాక్లాలో ఉన్న ఎయిర్ పోర్ట్ కూడా ఎంతో ప్రమాదకరమైనదిగా గుర్తించారు.































