Writer BVS Ravi : ఆహా ఒరిజినల్స్ లో వస్తోన్న అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ధ హిట్టో అందరికీ తెలుసు. రేటింగ్స్ విషయంలోను అలాగే ఆహా సబ్స్క్రిప్షన్ విషయంలోనూ ఆహా కు మంచి ఊపునిచ్చింది ఈ షో. బాలకృష్ణ లో కొత్త కోణాన్ని అందరికీ పరిచయం చేసిన ఈ షో రైటర్ గా మచ్చ రవి అలియాస్ బివిఎస్ రవికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతకుముందు ఎన్నో సినిమాలకు రైటర్ గా అలాగే కొన్ని సినిమాలను డైరెక్ట్ చేసినా కూడా ఈ షోతో సరికొత్త గుర్తింపు అందుకున్నారు మచ్చ రవి. అయితే ఈ షో గురించి అలాగే బాలకృష్ణ గారిని తీసుకోవడం గురించి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే ఈ షోకి అందరూ ఎదురుచూస్తున్న చిరు బాలయ్య కాంబినేషన్ ఎపుడు రాబోతోంది అన్న విషయాలను మాట్లాడారు.

చిరు తో షో ప్లాన్ చేసినా…
మొదట ఆహా వాళ్ళు వేరే రైటర్ డైరెక్టర్ ని అనుకున్నా సెట్ కాకపోవడంతో రవిని తీసుకున్నారట. ఏ హీరోతో షో చేయాలి అనుకున్నపుడు బాలకృష్ణ గారిని అనుకున్నారట రవి. ఆయన అయితే షో ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపించిందట. నా ఊహల్లో ఉన్న బాలకృష్ణ స్టేజి మీద బాలకృష్ణ ఒకరైతే ఖచ్చితంగా షో హిట్ అనుకున్నారట రవి. అలా ఆయనతో మొదటి ఎపిసోడ్ కూడా ఎన్టీఆర్ గారు బాలకృష్ణ కు మీసాలు దిద్దుతున్న ఫోటో మీద నుండే స్టార్ట్ అవ్వడం చాలా బాగా డైలాగ్స్ కుదరడంతో షో హిట్ అని డిసైడ్ అయ్యాడాట.

అనుకున్నట్లే షో ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే అందరూ కోరుకుంటున్న మోస్ట్ వాంటెడ్ గెస్ట్ చిరంజీవి. బాలకృష్ణ చిరంజీవి ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో చూడాలన్నది వారి వారి అభిమానుల కొరికే కాదు తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురుచూసే అంశం. అందుకే ఆ కాంబినేషన్ కోసం ప్రయత్నించినా మొదటి సీజన్ లో చిరు గారు మూడు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదట. ఇక రెండో సీజన్ లో ఇద్దరూ అటు వాల్తేరు వీరయ్య, ఇటు వీర సింహా రెడ్డి సినిమాలతో విడుదల టెన్షన్ లో ఉండటం వల్ల కుదరలేదు అంటూ చెప్పారు రవి.