Writer &director Kanagala Jayakumar : సాంబశివరావు గారు రెచ్చగొట్టే సరికి ఆర్ నారాయణమూర్తి బాటిల్ ఎత్తేసాడు… మందు తాగక ఏం చేశాడంటే…: రైటర్ & డైరెక్టర్ కనగాల జయకుమార్

0
121

Writer & director Kanagala Jayakumar : నమ్మిన సిద్ధాంతాన్నే సినిమాగా తీసి ప్రజలలో చైతన్యం తీసుకురావాలనే తపన గల వ్యక్తి ఆర్. నారాయణమూర్తి గారు. ఒకప్పుడు ఆయన తీసిన విప్లవ సినిమాలన్నీ జనరంజకమైనవే. ఆయన ఓన్ ప్రొడక్షన్ స్నేహ చిత్ర బ్యానర్ మీద ‘అర్ధరాత్రి స్వాతంత్రం’ మొదటి సినిమా కాగా అది పెద్ద హిట్ అయింది. ఆ తరువాత దండోరా, చీమల దండు, అడవి దివిటీలు, లాల్ సలాం, ఎర్ర సైన్యం, దళం, చీకటి సూర్యుడు, ఊరు మనదిరా మరియు వేగు చుక్కలు వంటి విప్లవాత్మక సినిమాలను తీసి విజయం సాధించారు. ఆయన కెరీర్ మొదట్లో కృష్ణ గారి సినిమతో పరిచయం అయ్యారు. ఆయన వ్యక్తిత్వం, సినిమా కెరీర్ గురించి రైటర్, డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు మాట్లాడారు.

రెచ్చగొడితే బాటిల్ మద్యం తాగేసాడు…

ఆర్ నారాయణమూర్తి గారు ఇంటర్ చదవడానికి చెన్నై వెళ్లగా అక్కడ కృష్ణ గారి సినిమా ‘నేరం శిక్ష’లో ఒక చిన్న పాత్రతో మెరిసారు. ఆపైన దాసరి నారాయణ రావు గారి సలహా మేరకు చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆయన ‘ఒరే రిక్షా’ వంటి సినిమాలో మెయిన్ లీడ్ గా చేసారు. ఆయన తన గురువుగా భావించే దాసరి గారి వద్ద ఉన్న సమయంలో దాసరి గారి వద్ద ఉండే సంబశివరావు గారు సినిమా యూనిట్ కి కావాల్సిన అన్నీ చూసుకునేవారు, అసోసియేట్ డైరెక్టర్లు అందరినీ బాగా చూసుకునేవారు.

పద్మ గారికి బంధువు అవడం వల్ల దాసరి గారి వద్ద మరింత స్వేచ్చగా ఉండేవారు. ఆయన ఒకరోజు సాయంత్రం సమయంలో తాగడం అలవాటు, అలా కొంతమందితో కలిసి తాగుతున్న సమయంలో నారాయణమూర్తి గారిని తాగమని ఆఫర్ చేయగా ఆయన వద్దని చెప్పడంతో నువ్వసలు మగాడివేనా, తాగాలి అంటూ రెచ్చగొట్టారు. దీంతో నారాయణమూర్తి గారు హాఫ్ బాటిల్ ను రా మందు తాగేసారు. అందరూ చూస్తుండిపోయాం. తాగక తన రూమ్ వద్దకు వచ్చి గోడను పట్టుకుని కిందకు పడిపోయాడు అంటూ ఆయన గురించి కనగాల జయకుమార్ మాట్లాడారు.