Yamini Kalluri : కూచుపూడి నృత్యం అనగానే టక్కున గుర్తొచ్చేది శోభా నాయుడు. ఆమె కూచిపూడి నృత్య ప్రదర్శన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ఇస్తూ కూచిపూడి నృత్య ఔనత్యాన్ని ప్రపంచానికి చాటింది. అలానే తాను ఎంతో మందికి కూచిపూడి శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చి దిద్ధింది. అలాంటి వారిలో యామిని కల్లూరి ఒకరు. యామిని కల్లూరి కూచిపూడి నృత్య కారినిగా ఎన్నో ప్రదర్శనలను దేశ విదేశాలలో ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్త్రీలను చూస్తున్న తీరు, వర్మ లాంటి వారు మాట్లాడుతున్న విషయాలకు యూత్ కనెక్ట్ అవడం లాంటి విషయాల గురించి మాట్లాడారు.

వాళ్లే శృంగార తారలు.. తెర వెనుక జరిగేది తెలుసా…
యామిని కల్లూరి ఫెమినిస్ట్ గా స్త్రీలను ఒక వస్తువుగా చూస్తున్న తీరు గురించి నేటి సమాజాన్ని విమర్శించారు. అలానే వర్మ లాంటి వాళ్ళు స్త్రీలను గురించి మాట్లాడుతున్న వాటికి చాలా మంది మేము నీ అభిమానులం, కరెక్ట్ చెప్పావ్ ఆర్జీవి అంటూ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే భయంగా ఉందంటూ అభిప్రాయపడ్డారు. చిన్నతనంలో రేప్ గురై సెక్సువల్ అబ్యూస్ కి గురై గాయపడిన వారే నేడు శృంగార తారలుగా ఉంటున్నారని యామిని అభిప్రాయపడ్డారు. కొంతమంది డబ్బు కోసం అలాంటి వీడియోలు చేస్తుంటే మరి కొంతమంది తెలియక అలాంటి కాంట్రాక్టులో ఇరుక్కుని చాలా సందర్భాల్లో రేప్ కు గురవుతున్నారంటూ చెప్పారు. అలాంటి వీడియోలు చాలా మందికి అనుభూతిని ఇస్తున్నా ఆ వీడియో వెనుక ఆమె పడే నరకం చూడటం లేదు అంటూ విమర్శించారు.

అలాంటి వీడియోలను కొంతమంది వారి అనుభూతి కోసం చూస్తున్నారు. పరిశోధనల ప్రకారం అలాంటి సెక్సువల్ కంటెంట్ ఉన్న వీడియోలు చూసే సమయంలో మన బ్రెయిన్ లో సాగ భాగం పనిచేయకుండా మనం చూస్తున్నది మనలాంటి మనుషులనే అనే విషయం గుర్తించలేము, కేవలం జంతువులను చూస్తున్నట్లు అలాంటి వీడియోను చూసి అనుభూతి చెందుతున్నాం అంటూ యామిని వివరించారు. ఇలాంటి వీడియోలు నేటి సమాజాన్నీ నాశనం చేస్తాయంటూ చెప్పారు. ఒక స్త్రీ కేవలం ఆందుకోసం మాత్రమే అన్న భావనలను చాలా మంది నేటి తరాలకు రుద్ధుతున్నారు అంటూ చెప్పారు.