దేశంలో రెండవ దశ కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కరోనాను కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రముఖులు ఈ కరోనా విపత్కర సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. మరికొందరు భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించి ఎందరికో చేయూతగా నిలిచారు.

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు వాయిదా పడటంతో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కార్మికులు ఉపాధిని కోల్పోయి దీన స్థితిలో ఉన్నారు. అటువంటి వారికోసం కన్నడ స్టార్ హీరో యష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.షూటింగ్ జరగకపోవడంతో వివిధ భాగాలలో పనిచేసే కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే హీరో యష్ సినీ కార్మికుల కోసం భారీ విరాళం ప్రకటించారు.
కన్నడ సినీ ఇండస్ట్రీలో వివిధ భాగాలలో పనిచేసే మూడు వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున మొత్తం ఒకటిన్నర కోటి రూపాయలను సినీ కార్మికుల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే.
బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న
కేజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా కేజిఎఫ్2 చిత్రంలో హీరోగా నటించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.



























