సినిమాలకు స్వస్తి చెప్పన్నున్న యంగ్ హీరో..?

0
112

కోలీవుడ్ యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఉదయనిది స్టాలిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ స్టార్ హీరో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి మనవడిగా, ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు గా అందరికీ పరిచయమే. ఈ క్రమంలోనే స్టాలిన్ కొడుకు గా ఇటు రాజకీయాలలోనూ, అటు సినిమాలలోనూ ఎంతో చురుకుగా ఉంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఈ నటుడి గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కోలివుడ్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్ ఇకపై సినిమాలకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ హీరో క్రైం థ్రిల్ల‌ర్ “క‌న్నేనంబ‌తే” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఉదయనిది ఆర్టిక‌ల్ 15 ను కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత ఉదయనిది దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తన చివరి సినిమాను చేయనున్నారని కోలీవుడ్ సమాచారం.

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సినిమా పూర్తయిన తర్వాత ఉదయనిది ఇకపై సినిమాలకు స్వస్తి పలకనున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఉదయనిధి తన దృష్టిని మొత్తం రాజకీయాల వైపు మళ్లీస్తున్నట్లు తెలుస్తోంది.

తండ్రి బాటలోనే వెళ్తూ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయా రంగంలోకి అడుగు పెట్టడం వల్లే సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఉదయనిది స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నారనే విషయంలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే ఈ హీరో స్పందించే వరకు వేచి చూడాల్సిందే.