తెలంగాణ, రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి-శంకర్‌పల్లి రైల్వే ట్రాక్ పై ఓ యువతి కారుతో హల్‌చల్ చేసింది. రోడ్డును వదిలి రైల్వే ట్రాక్‌పై కారు నడపడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదానికి కారణమయ్యే ఈ ఘటన చూసి షాక్ అయిన స్థానికులు వెంటనే యువతిని అడ్డగించారు. అయితే వారిని ఆమె చాకుతో బెదిరించినట్లు చెబుతున్నారు. చివరికి స్థానికుల సాహసంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక సమాచారం మేరకు యువతి మద్యం సేవించి వాహనం నడిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వల్ల పలు రైళ్లు గంటల తరబడి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు కూడా విచారణ ప్రారంభించారు.
Please Take immediate action. Someone is driving a car on railway track between Lingampally and vikarabad junction @RPF_INDIA @SCRailwayIndia @AshwiniVaishnaw @RailwaySeva pic.twitter.com/U30UEcCtUF
— శిరీష్ (@Shireesh__) June 26, 2025





























