Youtuber Swathi Naidu : సోషల్ మీడియా సామాన్య జనానికి బాగా అందుబాటులోకి వచ్చాక ఎంతో మంది తమ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. నాణేనికి రెండు వైపులు ఉన్నట్లు ఈ సోషల్ మీడియాలో కూడా మంచి చెడు రెండూ ఉన్నాయి. అలానే యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫార్మ్స్ ద్వారా మంచిని చెప్పేవాళ్ళు అలానే చెడును ప్రభావితం చేసేవాళ్లు ఉన్నారు. అలానే అడల్ట్ కంటెంట్ చేస్తూ యూట్యూబ్ లో ఫేమస్ అయిన వ్యక్తి స్వాతి నాయుడు. ఇటీవల కోరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తో పలు వీడియోలను చేస్తూ మరింత వైరల్ అయిన ఈమె తన జీవితం, కుటుంబం గురించి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నా తండ్రి వల్ల రోడ్డున పడ్డాను… నా భర్త అలాంటివాడు…
రాకేష్ మాస్టర్ చనిపోయే చివరి రోజుల్లో యూట్యూబ్ ఛానెల్ కోసం చేసిన వీడియోస్ లో ఉన్న స్వాతి నాయుడు ఆయన మరణం తరువాత పలు ఇంటర్వ్యూలలో మాట్లాడారు. అలా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సొంతూరు విజయవాడ కాగా తల్లి బైండింగ్ పని చేసేదని తండ్రి తాగుతూ డబ్బు ఖర్చు పెట్టి కుటుంబాన్ని రోడ్డున పడేసాడని చెప్పింది. ఇక తల్లి ఇవన్నీ భరించలేక ఎప్పుడూ కొట్టేదని వాళ్ల టార్చర్ భరించలేక షిరిడి వెళ్లి అక్కడి నుండి హైదరాబాద్ వచ్చి సినిమాల్లో ప్రయత్నించాలని భావించగా అవకాశాలు రాలేదని తన వ్యక్తిగత విషయాలను తెలిపింది.

ఇక అడల్ట్ కంటెంట్ వీడియోలను చేస్తే తప్పేంటి అంటూ మాట్లాడిన స్వాతి నాయుడు తన వీడియోస్ చేసే విషయం తన భర్తకు, కుటుంబానికి తెలుసని, ఇవన్నీ తెలిసాకే తన భర్తతో పెళ్లయిందని తెలిపింది. ఏ పనిలో అయినా న్యాయం, అన్యాయం ఉంటాయి నేను ఎవరినీ మోసం చేసి ఈ పని చేయడం లేదు అంటూ చెప్పారు. ఇక తన భర్త తాను చేసే వాటిని అసలు పట్టించుకోరని కేవలం మందు తాగుతూ పాప గురించి మాత్రమే ఆలోచిస్తుంటాడని స్వాతి నాయుడు వివరించింది. తను చేసే పనిపట్ల తానేమీ బాధపడటం లేదని క్లారిటీ ఇచ్చింది.