YS Family: సెకీ విద్యుత్ ఒప్పందంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి సంతకాలు చేయాలని చెప్పడంతో నాకెందుకో డౌట్ వచ్చి సంతకాలు చేయలేదని వైకాపా నుంచి బయటకు వచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఇక ఈ వ్యాఖ్యలపై మాజీ వైకాపా మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. టీడీపీ కూటమి నుంచి బాలినేని ఎమ్మెల్సీ పదవిని ఆశించబట్టే జగన్మోహన్ రెడ్డి గురించి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవుల కోసమే తాను జగన్మోహన్ రెడ్డి పై తప్పుడు మాటలు మాట్లాడాలని చెప్పడంతో బాలినేని స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తి కాదని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మంత్రి ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నాను చంద్రబాబు పవన్ కోసమే తాను ఇలా మాట్లాడుతున్నానని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. తాను ఎవరి మెప్పు కోసమో పనిచేయలేదనే విషయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని బాలినేని కౌంటర్ ఇచ్చారు.

YS Family: విలువలులేని రాజకీయాలు..
ఇక ప్రత్యర్థులను ఎవరు బాగా తిడితే వారికే పదవులు ఇస్తాము అనే సాంప్రదాయాన్ని ఎవరు మొదలుపెట్టారు.. ఎవరు కొనసాగిస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసని, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటే జగన్ ఒకరే కాదని షర్మిల విజయమ్మ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులేనని ఈ సందర్భంగా బాలినేను శ్రీనివాస్ రెడ్డి చెవిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























