YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే జాతీయస్థాయిలో ఉన్నటువంటి సర్వే సంస్థలన్నీ కూడా కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిపాయి. ఇలా కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిపినటువంటి సర్వేలలో ఇండియా టుడే యాక్సిస్ కూడా ఒకటి అని చెప్పాలి.

ఇండియా టుడే యాక్సిస్ సర్వే సైతం కూటమి అధికారంలోకి రాబోతుందని వైయస్ జగన్ ఓటమిని ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా వైయస్ జగన్ ఓటమిని ఎదుర్కోవడానికి గల కారణాలను కూడా ఇండియా టుడే యాక్సిస్ వెల్లడించింది. మరి జగన్ ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..
జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అందించినప్పటికీ ఈసారి ఓటమిని ఎదుర్కోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించడమేనని ఇండియా టుడే యాక్సిస్ వెల్లడించింది. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించడంతో జగన్ పట్ల వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్..
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలపటం కూడా జగన్ ఓటమికి కారణం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించే సమయంలో పలువురు ఎమ్మెల్యే ఎంపీలను కూడా పెద్ద ఎత్తున మార్పులు చేశారు. ఇలా మార్పులు చేయడం కూడా ఆయనకు మైనస్ గానే మారిందని చెప్పాలి. రిజర్వేషన్లతో సహా పలు అంశాలు కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత తీసుకురావడం కూడా జగన్ కి మైనస్ గా మారిందని ఈ కారణాలవల్లే కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు.





























