YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివెందులలో ఉన్న సంగతి మనకు తెలిసినదే. ఈయన గత రెండు రోజుల క్రితం పులివెందులకు చేరుకున్నారు. మరో మూడు రోజులపాటు ఇక్కడే ఉండబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం భారీగా తరలివస్తున్నారు.

ఇలా తనని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా జగన్ మాట్లాడటమే కాకుండా వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అభిమానులకు కార్యకర్తలందరికీ కూడా ఈయన భరోసా కల్పిస్తున్నారు. ఇటీవల ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమిపాలు అయ్యారు. గత ఎన్నికలలో 151 సీట్లు గెలుపొందిన ఈయన ఈ ఎన్నికలలో మాత్రం 11 సీట్లకు పరిమితమయ్యారు.
ఇలా జగన్ ఓటమిని జీర్ణించుకోలేని కొంతమంది ఆయనని కలిసిన సమయంలో ఎమోషనల్ అయ్యారు అయితే పార్టీ కార్యకర్తలందరికీ కూడా జగన్ భరోసా ఇచ్చారు. మనకు మంచి రోజులు వస్తాయని ఎవరు అధైర్య పడవద్దని తెలిపారు. నేను మళ్లీ ప్రజలలోకి వస్తా అందరికీ అండగా ఉంటా.. రాబోయే రోజులు మనవి అంటూ ఈయన భరోసా కల్పించారు.
మళ్లీ ప్రజలలోకి వస్తా..
ఇకపోతే మరి కొంతమంది కాంట్రాక్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు.పులివెందుల పట్టణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విడుదల కావాల్సిన 100 కోట్లు బిల్లులు ఇంకా విడుదల కాలేదనే విషయాన్ని ఈయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ విషయం తన వరకు ఎందుకు తీసుకురాలేదంటూ అధికారుల పట్ల జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కోర్టుకు వెళ్లి అయినా సరే మనం బిల్లులను తెచ్చుకుందాం అంటూ ఈయన వారికి భరోసా ఇచ్చారు.





























