YS Jagan Mohan Reddy: మహానేత దివంగత నాయకుడు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి వేడుకలు నేడు ఎంత ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు నాయకులు రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

ఇక వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకొని ఇడుపులపాయలో ఉన్నటువంటి తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించారు. ఇక జగన్ ఇడుపులపాయకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమని భారతి కూడా ఈ జయంతి వేడుకలలో పాల్గొన్నారు.
ఇకపోతే వైయస్ విజయమ్మ కూడా వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని చూసే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఇలా తల్లితో కలిసి వైఎస్ జగన్ దంపతులు తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన తండ్రి గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు.
వైయస్సార్ జయంతి వేడుకలు..
నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి అంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.





























