YS Jagan: ఏపీ ఎన్నికలు మే 13వ తేదీ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఒకవైపు వర్షం వస్తున్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సాయంత్రం 6 గంటలకే ముగియాల్సిన పోలింగ్ కొన్ని ప్రాంతాలలో అర్థరాత్రి వరకు జరిగింది. ఇలా భారీ స్థాయిలో ఈసారి పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే .అయితే ఈ పెరిగిన పోలింగ్ దేనికి సంకేతం అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం కట్టబెట్టడానికే ప్రతి ఒక్కరూ కదిలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇలా పలు సర్వే సంస్థలతో సర్వేలు చేయించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ మీడియా వారితో కూడా సంప్రదించి గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేసే ఈయన లండన్ వెళ్లిపోయారు. ఇక ఇప్పటికే పలు సర్వేలు కూడా వైసీపీకే అనుకూలంగా ఫలితాలను వెల్లడిస్తున్నాయి. దీంతో వైజాగ్ లో తన ప్రమాణస్వీకారం ఉండబోతుందని జగన్ వెల్లడించారు.
విజయంపై కూటమి మౌనం..
ఇప్పటికే అక్కడికి భారీ స్థాయిలో అభిమానులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. జూన్ 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఉండబోతుందని తెలుస్తుంది. అయితే తాజాగా సమయం కూడా ప్రకటించారు. జూన్ 9వ తేదీ ఉదయం 9:30 నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్యలో జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలియజేయడంతో జగన్ గెలుపు పై మరి ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి నేతలు మాత్రం గెలుపు గురించి ఎక్కడ గట్టిగా చెప్పిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి.





























