YS Sharmila: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ కి లేఖ రాయడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు వాలంటీర్లు దూరంగా ఉన్నారు. దీంతో పింఛన్లు పంపిణీ విషయంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటూ లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకున్నారు.

ఇలా ఎండలకు సచివాలయం వద్దకు వెళ్లాలి అంటే ఎంతో ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి అయితే ఈసారి అలాంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం ఎన్నికల కమిషన్ ఏపీ ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీచేసింది. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయి ఉంటుందో వారందరికీ బ్యాంకులోనే పెన్షన్ వేయాలని, ఇక వయసు పైబడిన వారు వికలాంగులు వంటి వారికి సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయాలని చెప్పారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే సర్కార్ మే ఒకటవ తేదీన పెన్షన్ లబ్ధిదారులందరికీ బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్ వేశారు. దీంతో వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి బ్యాంక్ వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున బ్యాంకు వద్ద బారులు తీరి ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఎండ తీవ్రత తట్టుకోలేక మరణిస్తున్నారు. అయితే ఈ విషయంపై షర్మిల మండిపడ్డారు.
బ్యాంకుల వద్ద బారులు తీరిన వృద్ధులు..
ప్రతినెలా వృద్ధులను చంపడమే టార్గెట్ గా వైసీపీ వ్యవహరిస్తుందంటూ ఈమె మండిపడ్డారు. అయితే పెన్షన్ బ్యాంక్ అకౌంట్ లలో వేయాలి అంటూ గత నెల సలహాలు ఇచ్చినటువంటి వారిలో షర్మిల కూడా ఒకరు ఉండటం గమనార్హం. ఈ విషయం ఈమె మర్చిపోయిందేమో తెలియదు కానీ ఇప్పుడు వైసిపి పై నింద వేయడం ఎంతవరకు సబబు అంటూ వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.





























