YS Sharmila: వైయస్సార్ ముద్దుబిడ్డ వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత జరిగిన ఎన్నికలలో భాగంగా ఈమె కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎలాగైనా అక్కడ వైయస్ అవినాష్ రెడ్డిని ఓడించాలని ఈమె కంకణం కట్టుకున్నారు.

ఈ క్రమంలోనే తన చెల్లెలు సునీతతో కలిసి తన బాబాయ్ హత్య కేసును అడ్డుపెట్టుకొని కడపలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగానే ప్రచార కార్యక్రమాలను చేశారు.
ఇక కడపలో పోటీ చేసిన షర్మిల సైతం ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఈమె కడపలో తాను ఓటమికి గల కారణాలను తెలియజేశారు. కడపలో తాను ఓటమిపాలు కావడానికి కారణం ఎక్కువ రోజులు ప్రచారానికి సమయం కేటాయించలేదని తెలిపారు. తాను కేవలం 14 రోజులు మాత్రమే ప్రచారం చేశాను మిగతా రోజులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి సరిపోయిందని తెలిపారు.
వైయస్సార్ బిడ్డ అని తెలీదు..
ఇక కడప నియోజకవర్గంలో చాలా గ్రామీణ ప్రాంతాలలో వైయస్సార్ బిడ్డ షర్మిల పోటీ చేస్తుంది అనే విషయం తెలియక పోవడం కూడా ఒక కారణమని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని మార్చాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు .అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతోనే ఒకే పార్టీకి ఓట్లు వేశారంటే ఈ సందర్భంగా ఈమె ఓటమికి గల కారణాలను తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























