YS Sharmila: వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత తన సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈమె జగన్ మోహన్ రెడ్డి గురించి మాత్రమే కాకుండా తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు చేసిన అవినాష్ రెడ్డి అయితే తనని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అంటూ ఎన్నోసార్లు వారిపై విమర్శలు చేస్తూ వచ్చారు.

తాజాగా మరోసారి గొడ్డలి పోటు రాజకీయాలు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన తండ్రి మహేష్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్ సీటులో రాసినటువంటి వారికి ఏఏజీ పదవులు ఇచ్చారంటూ ఈమె మండిపడ్డారు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి లేనప్పుడు సిబిఐ విచారణ కావాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వద్దన్నారో తెలియడం లేదని తెలిపారు.
ఇక జగన్ ను తెలంగాణలో చూసుకునే రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను వెయ్యి కోట్లు కనుక తీసుకొని ఉంటే నిరూపించాలని ఈమె ప్రశ్నించారు.తన భర్త అనిల్ భాజపా నేతలను కలిసినట్టు విమర్శించారు. తన భర్త ఎవరిని కలవలేదని అవినాష్ లాగా అర్ధరాత్రి గొడ్డలి పోటు రాజకీయాలు మాకు తెలియవు అంటూ ఈ సందర్భంగా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.





























