అమరావతి: ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపుతో వివాదంలో చిక్కుకుంది. నందిగామ గాంధీ సెంటర్‌లో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఎలాంటి సమాచారం లేకుండా అర్థరాత్రి తొలగించడంతో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైఎస్ షర్మిల కూడా కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.

“వైసీపీకి, వైఎస్‌ఆర్ గారికి అసలు ఏమి సంబంధం? మహానేత పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆయనపై పేటెంట్ హక్కు వస్తుందా? లేదా ఆయన సొత్తు అవుతారా?” అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్‌ఆర్‌సీపీపై ఉన్న కోపాన్ని వైఎస్‌ఆర్ విగ్రహాలపై చూపించటం సరైన పద్ధతి కాదని ఆమె ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసి, తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం కృషి చేసిన గొప్ప ప్రజానాయకుడని ఆమె గుర్తు చేశారు.
ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనలో దేశానికే దిశానిర్దేశం చేసిన నాయకుడిగా వైఎస్‌ఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని షర్మిల పేర్కొన్నారు. “ఇంతటి ప్రజాభిమానం కలిగిన నాయకుడిని నీచ రాజకీయాలకు బలిచేయడం ఎక్కడి దిక్కుమాలిన చర్య?” అంటూ ఆమె మండిపడ్డారు. విగ్రహాలపై కక్ష సాధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి చర్యలు ఏ విధంగానూ సమర్థనీయమవని ఆమె ఖండించారు.
కూటమి ప్రభుత్వానికి YCPపై కోపాన్ని YSR గారి విగ్రహాల మీద చూపిస్తారా ? అసలు YCPకి YSRకి ఏం సంబంధం ? మహానేత పేరు పెట్టినంత మాత్రాన YSR ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా ? YSR గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల… pic.twitter.com/fTOT8iwWRv
— YS Sharmila (@realyssharmila) August 8, 2025
































