YS Sharmila: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక హోదా విషయం పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర విభజన జరిగిన పది సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. అయితే గత రెండు పర్యాలు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మన తెలుగు ఎంపీల అవసరం లేకపోవడంతో ప్రత్యేక హోదా కోసం పెద్దగా పోరాటాలు కూడా చేయలేదు.

ఇకపోతే ఈసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి బీహార్ ఏపీ రాష్ట్రాలు చాలా కీలకంగా మారాయి. ఈ రెండు రాష్ట్రాలు మద్దతు తెలిపితేనే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు రాష్ట్రాలు ఏమి డిమాండ్ చేసిన చేయాల్సిన పరిస్థితి నరేంద్ర మోడీకి ఉందని చెప్పాలి.
ఈ క్రమంలోనే బీహార్ ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటూ తీర్మానాన్ని ప్రధాని ముందు పెట్టారు కానీ ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఈయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల సైతం చంద్రబాబును సూటిగా ఇదే విషయం గురించి ప్రశ్నించారు.
కింగ్ మేకర్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేస్తూ మోడీ ముందు తీర్మానం పెడితే మీరు మాత్రం ఏపీ ప్రత్యేక హోదా గురించి కనీసం నోరు కూడా విప్పడం లేదు నరేంద్ర మోడీ సర్కారులో కింగ్ మేకర్ గా ఉన్న మీరు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా అంటూ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.





























