YS Vijayamma: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మరొక రెండు రోజులలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా అందరి ఆసక్తి ఏపీ ఎన్నికలపైనే ఉంది. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆతృత అందరిలోనూ నెలకొంది వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు.

మరొకవైపు తెలుగుదేశం పార్టీ జనసేన టిడిపి పొత్తులో భాగంగా కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరీ ఆమె కూడా కడప పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ తన అన్నయ్య వైయస్ అవినాష్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి చాలెంజ్ చేస్తూ ఉన్నారు.
ఎన్నికలు మరొక రెండు రోజులలో జరగబోతున్నాయి అన్నటువంటి తరుణంలో వైఎస్ విజయమ్మ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన బిడ్డ షర్మిలను గెలిపించాలని కోరుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వైయస్సార్ బిడ్డ షర్మిలమ్మను గెలిపించాలని కోరారు.
షర్మిలకు మద్దతుగా విజయమ్మ..
వైయస్సార్ ను ప్రేమించే వారికి తనని అభిమానించే వారందరికీ నా నమస్కారాలు. రాజన్న ముద్దుబిడ్డ షర్మిలను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను. వైయస్సార్ ను ఆదరించినట్లే కడప ప్రజలందరూ షర్మిలను కూడా ఆదరించాలని వైయస్సార్ కడపకు సేవ చేసిన విధంగానే షర్మిలకు ఆ అవకాశం కల్పించాలి అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.





























