AP politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కేవలం రెండు వారాలు సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పార్టీ అధినేతల సైతం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంతో ప్రజలందరిలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది.

ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత ఓటు ఎవరికి వేయాలి అనే విషయంపై ప్రజలందరూ కూడా ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్లస్ అంటూ గత ఎన్నికలకు ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసి ఆ పథకాలకు కొంత మొత్తంలో డబ్బులు అధికంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కూటమి సైతం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేనిఫెస్టోలో ఎన్నో రకాల పథకాలు అలాగే సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇలా ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఎంతోమంది ద్వితీయశ్రేణి వైసిపి కార్యకర్తలు నాయకులు టిడిపిలోకి చేరికలు మొదలుపెట్టారు.
కూటమి గెలుపు ఖాయం..
మేనిఫెస్టో విడుదల తర్వాత వచ్చేది కచ్చితంగా కూటమియే అని గ్రహించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టిడిపిలోకి వలస వెళ్తున్నారు. ఈ విధంగా కూటమి ప్రకటించిన మేనిఫెస్టో కనుక చూస్తే కచ్చితంగా వైసీపీకి ఓటమి తప్పదని కూటమి గెలుపు ఎవరు ఆపలేరని చెప్పాలి.





























