టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటనపై ఉత్కంఠ వీడింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో ఐదుగురిని కార్యనిర్వహణ అధ్యక్షులుగా.. పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లుగా నియమించింది.


































