నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసారు. ఈ క్రమంలో రతన రాజీనామా పత్రాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీకి పంపించారు ఈటల.

2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు ఈటల రాజేందర్. తాజా పరిణామాలతో ఆయన ఈ పదవికి రాజీనామా చేసారు. ఇటీవలే ఈటల తెరాస కి రాజీనామా చేసి బీజేపీ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సొసైటీ పాలకమండలి సభ్యులు సమావేశమై ఈటల రాజీనామా ను ఆమోదించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ పదవిని మంత్రి కేటీఆర్ కు ఇచ్చే యోచనలో పాలకమండలి ఉన్నట్టు తెలుస్తుంది.


































