మనం ప్రాణంతో ఉండటానికి ఆక్సిజన్‌ వాయువు అవసరం ఎంతో ఉంది. అందుకే ఆ వాయువును ప్రాణవాయువు అంటారు. వాతావరణంలోని గాలిలో ఉండే ఆక్సిజన్‌ను మనలాగా చెట్లు కూడా పీల్చుకుంటాయి. అలా పీల్చుకోవడమే కాకుండా పగటి పూట అవి ఆక్సిజన్‌ను వదిలి మనకు ఎంతో ప్రాణవాయువును అందిస్తాయి. అవే చెట్లు రాత్రి వేళల్లో చెడు గాలిని వదులుతాయి. ఈ గాలిలో హానికరమైన కార్బన్‌డైఆక్సైడ్‌ ఉంటుంది. రాత్రివేళల్లో చెట్ల కింద పడుకుంటే, అవి ఆ సమయంలో ఎక్కువగా కార్బన్‌డై ఆక్సైడ్‌ను విడుదల చేయడం వల్ల మనకు అవసరమైన, కావల్సినంత ఆక్సిజన్‌ లభించదు. దాంతో మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్లే రాత్రివేళల్లో చెట్లకింద పడుకోకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here