అమెరికాలో ఈ కాల్పుల మోత.. ఏమయిందో తెలియదు సడన్ గా ఒక ఉన్మాది సుమారు గంటన్నర సమయం పాటూ తుపాకీతో భీభత్సం సృష్టించాడు. అరిజోనా రాష్ట్రంలో ఒక వ్యక్తి బైక్ పై తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు, ఎవరి కనిపిస్తే వారిపై కాల్పులు జరిపాడు. ఫీనిక్స్ పరిసర ప్రాంతాల్లోని 8 చోట్ల ఒకటిన్నర గంటలపాటు కాల్పులు జరిపాడు. అయితే ఈ దుండగుడు జరిపిన ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కాగా..మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

అయితే ఈ ఘటనపై పియోరియా పోలీసు అధికారి బ్రాండన్ షెఫెర్ట్ మాట్లాడుతూ.. ఈ నిందితుడు ఇలా ఎందుకు చేశాడో ఇప్పటివరకూ సరైన కారణాలు తెలియదని, అయితే జరిగిన ఈ కాల్పుల ఘటనపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు.. అంతేకాకుండా ఈ ఘటన చాలా మందిని భయబ్రాంతులకు గురి చేసిందని తెలిపారు.






























