కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌తో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ లు భేటీ అయ్యారు. తాజగా లాక్ డౌన్ సడలింపులు మరియూ ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై ప్రధానంగా చర్చ జరుగుతంది.

అయితే జూన్ 19తో తెలంగాణలో విధిన లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపధ్యంలో 20 తర్వాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయాలా? లేదా నైట్ కర్ఫ్యూ విధించాలా? అనే విషయంపై ప్రాస్తుతం జరిగే సమావేశంలో చర్చించి దీనిపై ఈరోజే కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీ తరహా అన్ లాక్ కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


































