దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల 40వేల దిగువకు పడిపోయిన కేసులు.. వరుసగా రెండోరోజు పెరిగాయి. మరణాలు కూడా మరోసారి 1,000 మార్కును దాటాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. తాజాగా 19,21,450 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 48,786 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

24 గంటల వ్యవధిలో 1,005 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,04,11,634 మంది కరోనా సోకగా.. 3,99,459 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,23,257 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. యాక్టీవ్ రేటు 1.77 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే 61,588 మంది కరోనా నుంచి కోలుకున్నారు.































