భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసులలో తగ్గుదల కనిపించింది. తాజాగా 38,667 మంది వైరస్ బారిన పడగా.. 478 మంది మరణించారు. 35,743 మంది కరోనానుంచి కొలుకున్నారు. రికవరీ రేటు 97.46 శాతానికి చేరింది. క్రియాశీలక కేసులు సంఖ్య 1.20 శాతంగా ఉంది.

ఇప్పటికి వరకు దేశంలో నమోదైన కేసులు వివరాలు:
మొత్తం కేసులు: 3,21,56,493
మరణాలు: 4,30,732
కోలుకున్నవారు: 3,13,38,088
యాక్టివ్ కేసులు: 3,87,673
కేరళ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కేరళలో కొత్తగా 20,452 కేసులు నమోదు కాగా.. 16,856 మంది కోలుకున్నారు. 114 మంది ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్రలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 6,686 కొవిడ్కేసులు నమోదు అవ్వగా… 158 మంది మృతిచెందారు.





























