ఈ కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే కరోనా దెబ్బకు దేశాలు అన్ని లాక్ డౌన్ ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు అనే సమయానికి సెకండ్ వేవ్ అంటూ మళ్ళి విజృంభిస్తుంది. అయితే మనుషులను మాత్రమే పట్టి పీడిస్తున్న ఈ వైరస్ తాజాగా జంతువులను సైతం కలవరపెడుతుంది.

నిజమే.. స్పెయిన్ లోని బార్సిలోనా జూలో తాజాగా 4 సింహాలకు కరోనా సోకింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జంతువులకు కరోనా సోకడం ఇది రెండవసారి. అసలు ఈ సింహాలకు కరోనా వైరస్ ఎలా సోకింది అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. దీనిపై పూర్తీ విచారణ జరుపుతున్నారు. అయితే గత నెలలో ఈ జూలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ ఆని తేలింది. ఆ సిబ్బంది నుంచే కరోనా వ్యాపించి ఉండొచ్చు అనే వాదన బలంగా వినిపిస్తుంది.






























