ఒక్క ఫుడ్ ఆర్డర్ చేస్తే… ఏకంగా 42 మంది డెలివరీ బాయ్స్..!

0
108

ప్రస్తుతమున్న ఉరుకులు పరుగుల ప్రపంచంలో సరైన తిండి చేయటానికి,తినడానికి కూడా సమయం లేకుండా ఉంది. అలాంటి వారు ఆన్ లైన్ ద్వారా తమకు కావాల్సిన ఆహారాన్ని, వారు ఉన్న చోటకి ఆర్డర్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో కామన్ అయింది. ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య ఎక్కువ అవడంతో పలు సంస్థలు కూడా ఆన్ లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా మనం ఎంత ఫుడ్ ఆర్డర్ చేస్తే అంత మాత్రమే మనకి డెలివరీ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వింత సంఘటన ఏర్పడింది. ఒక అమ్మాయి ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే ఏకంగా 42 మంది డెలివరీ బాయ్స్ ఆమె ఇంటికి చేరుకొని ఫుడ్ డెలివరీ చేశారు. ఈ విచిత్ర సంఘటన ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది.

ఫిలిప్పీన్స్‌లోని సెబూ సిటీలో స్కూలులో ఓ అమ్మాయి తనకు ఇష్టమైన ఫుడ్ తినాలనిపించి ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసింది. అయితే ఆర్డర్ చేసి ఫుడ్ కోసం తనతో పాటు తన నాయనమ్మ కూడా ఎదురు చూడసాగారు. ఇంతలోనే ఆమె ఉంటున్న ప్రాంతానికి ఒక్కొక్కరుగా మొత్తం 42 మంది చొప్పున డెలివరీ బాయ్స్ ఫుడ్ తీసుకొని ఆమె ఇంటికి చేరారు.

ఒక్క ఫుడ్ ఆర్డర్ చేస్తే ఏకంగా 42 మంది డెలివరీ చేయడంతో ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒకేసారి 42 మంది డెలివరీ బాయ్స్ ఫుడ్ తీసుకొని రావడంతో అక్కడున్న వారు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఓ వ్యక్తి ఈ సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అతికొద్ది సమయంలోనే ఈ సంఘటన ఎంతో వైరల్ గా మారింది.

ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే 40 మంది రావడానికి గల కారణం ఏమిటని ఆరా తీయగా, ఫుడ్ ఆర్డర్ చేసే యాప్ లో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ఇలా జరిగినట్లు తెలిపారు ఒక డెలివరీ బాయ్ కి చేరాల్సిన ఆర్డర్ సాంకేతిక లోపం వల్ల ఏకంగా 42 మందికి ఆర్డర్ వెళ్లడంతో ఒకేసారి అందరూ కలిసి ఆ అమ్మాయికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here