తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

0
535

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో అన్ని కులాలకు చెందిన వారిని అర్చకులుగా నియమించింది. మెుదటి దశగా 24 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు సీఎం స్టాలిన్‌. వీరికి అర్చనకు సంబంధించిన పూర్తి స్థాయి శిక్షణ పొందిన తర్వాతే విధుల్లోకి తీసుకుంటారు. ఇప్పటివరకు దేవాలయాల్లో అర్ఛనకు ప్రధాన విధులు నిర్వహిస్తున్న వివిధ కులాల వారిని దేవాలయ అర్చకుల అవకాశం కల్పిస్తామని స్టాలిన్‌ ఇచ్చిన ఎన్నిక హామీని అమలు చేస్తున్నారు.

స్టాలిన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆగస్టు 14తో 100 రోజులు పూర్తైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. 24 మంది అర్చకుల నియమాకంతో పాటు మొత్తంగా పలు విభాగాల్లో 208 మంది నియామించారు. వీరిలో భట్టాచార్యులను వైష్ణవ పూజారులు, ఒధువార్లను శైవ సంప్రదాయ నిపుణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి.