ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా బాధితుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు దొరికినంత డబ్బులు దోచుకోవడం చూస్తున్నాము. చికిత్స పేరిట బాధితుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఆక్సిజన్ సిలిండర్ లను మాస్క్లను శానిటైజర్ లను ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తూ నుంచి సొమ్ము చేసుకోవడం చూస్తున్నాము. కొన్నిచోట్ల బాధితుల ఒంటిపై ఉన్న బంగారు నగలు కూడా అపహరణ జరగడం గురించి విన్నాం. కానీ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ ముఠా కొత్తతరహా మోసానికి తెర లేపింది.

కరోనాతో మరణించిన వారి వంటిపై ఉన్న దుస్తులను స్మశాన వాటిక లలో దొంగలించి వాటిని ఉతికి ఇస్త్రీ చేసి వాటిపై లేబుల్ లను అంటించి విక్రయాలను చేస్తుంటారు. ఈ విధమైన దొంగతనానికి పాల్పడిన ఏడుగురుని యూపీలోని బాగ్‌పట్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా స్మశాన వాటికలో కరోనా బాధితులపై కప్పి ఉన్న ముసుగులు సహా, చీరలు, కుర్తాలు, బెడ్‌షీట్లు, ఇతర వస్తువులను ఈ ముఠా చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటి వరకు ఈ ముఠా కరోనా మృతదేహాల నుంచి సుమారు 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 52 చీరలు దొంగిలించినట్లు వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడం విశేషం. ఈ విషయంపై వీటిని విచారించగా మరికొన్ని విషయాలను బయటపెట్టారు.

స్థానికంగా ఉండే కొందరు వ్యాపారులు వీరికి రోజుకు రూ.300 కూలి ఇచ్చి ఈ విధమైనటువంటి దొంగతనాలు చేయిస్తున్నట్లు కూడా నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ ఏడుగురిపై అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బాగ్‌పట్‌ పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here