నెల తక్కువ బిడ్డా.. విపరీతంగా పెరిగిపోతున్న జుట్టు!

0
72

సాధారణంగా పిల్లలు 9 నెలలు పూర్తి అయిన తర్వాత జన్మిస్తారు. ఈ విధంగా నెలలు నిండిన తర్వాత పుట్టిన బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కానీ కొందరు 8 నెలల కే జన్మిస్తూ ఉంటారు. ఇలా 8 నెలలకే జన్మించడం చాలా అరుదు. ఒకవేళ జన్మించిన ఎన్నో అనారోగ్య సమస్యలతో జన్మిస్తారు. అచ్చం ఇలాగే ఉత్తర ఐర్లాండ్‌లో ఓ బుడ్డోడు నెల తక్కువగా పుట్టాడు. నెల ముందుగా పుట్టినప్పటికీ అతని శరీర బరువు పెరగకపోగా అతని జుట్టు మాత్రం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ బుడ్డోడు ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయాడు.

ఉత్తర ఐర్లాండ్‌లో జాక్సన్ జేమ్స్ అయర్స్ అందరి పిల్లలు మాదిరి కాకుండా 8 వారాలు ముందుగానే జన్మించాడు. ప్రస్తుతం మూడు నెలల వయసున్న జాక్సన్ జుట్టు విపరీతంగా పెరిగిపోతుంది.అయితే ఈ విధంగా జుట్టు కేవలం తలపై మాత్రమే కాకుండా అతని శరీర భాగాలపై అధికంగా పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాబును చూసినవారందరూ త్వరలోనే తనని హెయిర్ కట్ తీసుకెళ్లాలని సలహాలు ఇస్తున్నట్లు పిల్లాడి తల్లి తెలియజేశారు.

కేవలం మూడు నెలల వయసుకే జాక్సన్ కి ఇలా జుట్టు పెరగడానికి గల కారణాన్ని తన తల్లి వివరించింది. ఆ పిల్లాడు హైపెర్ ఇన్సూలినిజమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి బారిన పడిన వారికి తరచూ డయాజోజైడ్ మందులు ఇవ్వాలి. ఇలా మందును ఇస్తూ బాబు శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా డయాజోజైడ్ మందులు ఇవ్వటంతో జాక్సన్ కి ఇలా జుట్టు పెరగడం వంటి సైడ్ఎఫెక్ట్ వచ్చిందని తెలిపారు.

హైపర్ ఇన్సూలినిజమ్ అనే అనారోగ్యం ప్రతి 30వేల మంది పిల్లల్లో ఒకరికి వస్తుంది. ఈ విధమైనటువంటి సమస్య ఉన్న వారిలో శరీరంలో చక్కెర శాతం పూర్తిగా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి డయాజోజైడ్ మందు ఇస్తూ ఉండాలి. ఈ మందు ఎవరు వాడినా ఈ జుట్టు పెరిగే సమస్య ఉంటుందట. ఈక్రమంలోనే జాక్సన్ కి మందులు వేయడం వల్ల అతనికి శరీర భాగం మొత్తం అధికంగా జుట్టు పెరిగినట్లు తల్లి షానన్ అయిరెస్ చెప్పినట్లు డైలీ మెయిల్ తెలిపింది.

అందరి తల్లులు మాదిరిగానే తన కొడుకును ఈ ప్రపంచానికి చూపించాలి అనే కుతూహలంతో అతని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాడి చుట్టూ వల్ల వాడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని షానన్ అయిరెస్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here