మనలో చాలామంది బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి పాటించాల్సిన విషయాల గురించి సరైన అవగాహన ఉండదు. బ్రౌన్ రైస్ రోజూ తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడంతో పాటు బ్రౌన్ రైస్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకురుతాయి. తెలుగులో బ్రౌన్ రైస్ ను దంపుడు బియ్యం అని అంటారు. బ్రౌన్ రైస్ వైట్ రైస్ తో పోల్చితే ఎక్కువ రుచిని కలిగి ఉండటంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

మధుమేహంతో బాధ పడే వాళ్లు బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించవచ్చు. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగించడంలో బ్రౌన్ రైస్ సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ ద్వారా లభించే ఫైబర్ బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు బ్రౌన్ రైస్ తీసుకుంటే బిడ్డకు తగినంత పోషణ లభిస్తుంది.
బ్రౌన్ రైస్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడే వాళ్లకు బ్రౌన్ రైస్ ఆ సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. క్యాన్సర్ కారక కణాలను నాశనం చేయడంతో పాటు కణాల వృద్ధిని అరికడుతుంది. డిప్రెషన్ లాంటి మానసిక సంబంధిత సమస్యలను తగ్గించడంలో బ్రౌన్ రైస్ సహాయపడుతుంది. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.
బ్రౌన్ రైస్ అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడితో బాధ పడే మహిళలకు మెరుగైన రోగనిరోధక శక్తిని అందించడంలో బ్రౌన్ రైస్ తోడ్పడుతుంది. మెదడు మరియు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.





























