సాధారణంగా కూరగాయల మార్కెట్లో కిలో బెండాకాయల ధర ఎంత ఉంటుంది.. రూ.40 లేదా రూ.50 ఉంటుంది. కొన్ని సమయాల్లో ఆ ధర రూ.80 వరకు కూడా ఉంటుంది. అంతకంటే దాదాపు ఎక్కువ రేటుకు బెండకాయలు అమ్మలేదు. అయితే ఇక్కడ మనం చెప్పుకునే బెండాకాయలు కిలో ధర ఎంతో తెలుసా.. రూ.300. అవును మీరు విన్నది నిజమే.. ఎందుకు అంత రేటు..అందులో అంత ప్రత్యేకత ఎంటి అనుకుంటాన్నారా.. అయితే తెలుసుకుందాం.. మిస్రీలాల్ రాజ్ పుత్ అనే రైతు మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లాలోని ఖజూరీ కలాన్ ఏరియాలో ఉంటున్నారు.

ఆయన వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. అయితే తనకు ఉన్న పొలంలో కొంత బెండను సాగు చేశాడు. అవి అందరూ సాగు చేసే బెండకాయలు కాదు.. అవి పచ్చరంగులో కాకుండా ఎరుపు రంగులో ఉన్నాయి. వీటిని అతడు వారణాసిలో వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి కేజీ బెండ విత్తనాలను తెచ్చి నాటినట్లు చెప్పాడు. అవి 40 రోజుల తర్వాత పంట నుంచి కాయ వరకు వచ్చింది. ఈ పంటకు అతడు ఎలాంటి పరుగుల మందు వాడలేదట.
వాటికి ఎలాంటి కీటకాలు, పురుగులు, గొగళి పురుగుల బెడద అస్సలే ఉండదని అతడు చెప్పాడు. అయితే ఎరుపు బెండకాలయల వల్ల లాభం ఏంటంటే.. అధిక బరువు ఉన్నవాళ్లు వీటిని వాడితే బరువు తగ్గే అవకాశం ఉంటుందట.. అంతే కాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు, హై బీపీతో బాధపడే వారు ఇవి తీసుకుంటే మంచిది అంటున్నాడు ఆ రైతు.
గుండెకు సంబంధించి ఏమైనా వ్యాధులు ఉంటే వీటిలో ఉండే అధిక పోషకాల వల్ల అవి మాయం అయిపోతాయంటున్నాడు. అందుకే వీటి ధర సాధారణ బెండ కాయల కంటే కాస్త ఎక్కువగా ఉంటుందని ఆ రైతు చెప్పుకొచ్చాడు.































