A.R Rehaman: ఇటీవల కాలంలో విడాకుల పరంపర అధికమవుతుంది ఒకప్పుడు ఇలాంటి కల్చర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికం అవుతుంది కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.

తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన 30 సంవత్సరాల వైవాహిక జీవితానికి విడాకులతో స్వస్తి పలికారు. తాజాగా ఈయన తన భార్య ఇద్దరు కూడా విడాకుల గురించి ప్రకటన ఇస్తూ చేసిన పోస్ట్ ఎంతోమంది అభిమానులను కలిచి వేసింది. ఇందుకు సంబంధించి ఆమె తరపు లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలే కారణమని తెలిపారు.

A.R Rehaman: బరువైన హృదయాలు..
ఇద్దరి మధ్య ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఈ భేదాభిప్రాయాలు అధిగమించలేని వివాదాలను సృష్టించడంతోనే ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారని తెలిపారు. ఇక ఈ విడాకులపై కూడా రెహమాన్ అధికారికంగా వెల్లడించారు.మేము సంతోషంగా ముప్పై కి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తెలిగింది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడు సింహాసనం కూడా వణుకుతుంది. ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వం లా కనిపించవు అంటూ ఈయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.































