Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఎన్నో విభిన్నమైన కథా చిత్రాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా కొనసాగుతున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటుడుగా కొనసాగుతున్న అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాలలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన చిత్ర బృందం తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే మీడియా ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర బృందం మాత్రం ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఇలా చిత్ర బృందం ప్రెస్ మీట్ కు ఆలస్యం కావడంతో నటుడు అమీర్ ఖాన్ బహిరంగంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు.కొన్ని అనివార్య కారణాల వల్ల రావడం కాస్త ఆలస్యమైందని అందుకు మీడియా మిత్రులు క్షమించాలని కోరారు.

Aamir Khan:హాలీవుడ్ రీమేక్ చిత్రం…
ఇలా పలు భాషలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ నటించగా అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకెక్కించారు ఇకపోతే ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలు విడుదల చేయనున్నారు.
































